దేశంలోనే అత్యాధునిక వసతులతో స్టేడియాన్ని అమరావతిలో నిర్మిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన యువ క్రికెటర్ నితీశ్‌కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. నితీశ్‌కు అభినందనలు తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని శివనాథ్ పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.