జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో భూ సర్వే చేపట్టడంతో వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు . ముత్తుకూరులో ఇవాళ(శనివారం) ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వంలో అసైన్డ్ ల్యాండ్స్, బినామీ పట్టాలు, డీకేటీ భూముల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి దుర్మార్గాలకు ఆంధ్రప్రదేశ్ నెలవైందని అన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందని చెప్పారు. భూ కుంభకోణం చేసిన వారంతా జైలుకు పోవాల్సిందేనని హెచ్చరించారు. సర్వేపల్లిలో కూడా భూకుంభకోణం పెద్ద ఎత్తులో జరిగిందని... తప్పకుండా అన్నిటిని బయటకు తీస్తామని : ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు.