ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాహిత పాలన కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. లక్ష 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని చెప్పారు. రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. గడిచిన ఐదేళ్లు రెవెన్యూ సమస్యలు గాలికి వదలివేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు సరిచేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రోత్ సెంటర్స్ ఆధారంగా చార్జీలు పెరుగుతాయని అన్నారు. మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువగా ఉన్నచోట తగ్గిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద 0 నుంచి 20శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు తిరుగుదల ఉంటుందన్నారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు 0శాతం మాత్రమే ఉన్నాయన్నారు. రూ. 9,500 కోట్లు టార్గెట్ రీచ్ అవుతామని తెలిపారు. గత నెలతో పోల్చితే ఈ నెల రెవెన్యూ పెరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.