ఏపీలో పలు ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీకి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పెట్టుబడులు ఏపీకి రావడం వల్ల 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి . SIPB సమావేశంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీవైపు పయనిస్తుందని తెలిపారు. ఏపీ ఆ దిశగా ఆలోచనలు చేయాల్సి ఉందన్నారు. యూనిట్ విద్యుత్ ధర రూ.5.18 నుంచి రూ.4.80కు తగ్గించడం లక్ష్యమని చెప్పారు. యూనిట్ విద్యుత్ ధర తగ్గించేందుకు వినూత్న యోచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో వినూత్న మార్పు చూస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రజాభిప్రాయానికి తగ్గట్టే పాలన ఉంటుందని తెలిపారు. అధికారులు తమ పనితీరుతో ప్రజలను మెప్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు.