రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించారు. మచిలీపట్నం సబ్‌జైలుకు నిందితులను తరలించారు. ఈ కేసులో నిందితులుగా గోదాము మేనేజర్ మానస్ తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజు ఉన్నారు. వీరిని రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని