టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మరోసారి సారథ్య బాధ్యతలు దక్కుతాయని తెలుస్తోంది. ఆసీస్‌తో సిరీస్ అనంతరం రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెబుతాడని సమాచారం.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ అనంతరం మేనేజ్‌మెంట్ కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులోభాగంగా రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం లేదా అతడే స్వయంగా వైదొలగడం జరిగితే..సీనియర్‌గా ఉన్న విరాట్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందని తెలుస్తోంది.