అవయవదానం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు మెడికల్ కాలేజీలో అవయవదాన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అవయవదానంపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు ఐదు బ్రెయిన్‌డెడ్ కేసులు వస్తున్నాయి. పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆసుపత్రులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. అవయవాలపై వ్యాపారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.