ఆధ్యాత్మిక గురువు సచ్చిదానంద స్వామి సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని పేర్కొన్నారు. చంద్రబాబు కర్మ యోగి అన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘కృష్ణానది ఒడ్డును జరిగిన సభను మర్చిపోలేను. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర కావడం తథ్యం’’ అని తెలిపారు.