ముంబైలోని కుర్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. తన తల్లి సొంత అక్కను ఎక్కువగా ఇష్టపడుతుందని రేష్మ భావించింది. ఇద్దరి మధ్య చాలా కాలంగా మనస్పర్థలు ఉండేవి. ఈ కారణంగా తల్లి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో రేష్మ వంటగదిలోంచి కత్తి తీసి తల్లిని పొడిచి చంపేసింది. తల్లిని హత్య చేసిన వెంటనే.. చునాభట్టి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి రేష్మను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa