ఎమ్మిగనూరు పట్టణంలోని సున్నం బట్టి వీధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున గుడిసెలో మంటలు చేలరేగి కాలిపోతుండడంతో చుట్టు పక్కల వారు గమనించి కేకలు వేశారు. కొందరు ఫైర్‌స్టేషనకు ఫోన చేయగా ఫైర్‌స్టేషన సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. బాధి తుడు హజీ మలాంగ్ బాబా మాట్లాడుతూ స్వీట్ల దుకాణంతో జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎమ్మిగనూరు జాతరలో స్వీట్ల దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు సుమారు రూ. 10లక్షలు విలువ గల స్వీట్లు తయారు చేసుకొని గుడిసెలో భద్రపరిచినట్లు వాపోయారు. ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కావడంతో తయారు చేసుకున్న స్వీట్లు, సరుకు, నూనె ఇతర సామగ్రి కాలి బూడిద అయిం దని విలపించాడు.