జొమాటో క్విక్ డెలివరీ సేవల్ని తిరిగి ప్రారంభించింది. గతంలో పరిచయం చేసిన ఈ సర్వీసులను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీలను అందించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
క్విక్ డెలివరీ సర్వీసుల గురించి జొమాటో అధికారికంగా ప్రకటించలేదు. అయితే ముంబయి, బెంగళూరు.. వంటి ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఇప్పటికే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలుస్తోంది.