AP: విశాఖ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ భారత్‌ను గొప్ప దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. ఆత్మనిర్భర్, స్వచ్ఛభారత్, నినాదాలతో ప్రజల మనసు గెలిచారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకున్నారు. రాష్ట్రానికి రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధే మోదీ ఆశయం’’ అని అన్నారు.