ప్రపంచం, దేశం మెచ్చిన నాయకుడు మోదీ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధాని విశాఖ పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదొక శుభదినమన్నారు. గత ఎన్నికల్లో చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించారని, రేపు ఢిల్లీలో జరిగే ఎన్నికల్లోనూ ఎన్డీయే గెలవడం ఖాయమన్నారు. సంక్షేమం, సుపరిపాలనతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మోదీపై ప్రశంసలు కురిపించారు.