ముందు వెళుతున్న స్కూటీని టిప్పర్ లారీ వెనుక నుండి ఢీ కొని విద్యార్థిని ఏడుమళ్ల రాధ (16) మృతిచెందగా స్కూటీ నడుపుతున్న మరో మహిళ ఈర్లపాటి సుబ్బలక్షమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మార్కాపురం మండలంలోని జమ్మనపల్లి గ్రామ సమీపంలో అట్టల ప్యాక్టరీ వద్ద రోడ్డుపై గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురం పట్టణంలోని కోనేటివీధిలో నివాసం ఉంటున్న ఈర్లపాటి సుబ్బలక్ష్మమ్మ తన అక్క మనువరాలు ఏడు మళ్ల రాధతో కలిసి తన స్వగ్రామం మార్కా పురం మండలం కొత్తపల్లి గ్రామానికి గురువారం సాయంత్రం స్కూటీపై వెళ్లింది. తిరిగి వీరు రాత్రి మార్కాపురం వస్తున్నారు. మార్గమధ్యలో మార్కాపురం జమ్మనపల్లి రోడ్డులోని అట్టల ప్యాక్టరీ వద్ద వెనుక వైపు వస్తున్న టిప్పర్ లారీ వీరి స్కూటీని ఢీ కొట్టింది. దీంతో స్కూటీ వెనుక కూర్చున్న రాధ ఘటనా స్థలం వద్దే మృతి చెందింది. స్కూటీ నడుపుతు న్న సుబ్బలక్షమ్మకు కాలికి, చేతులకు తీవ్రగాయాలయ్యా యి. మృతురాలు ఏడుమళ్ల రాధ మండలంలోని రాయ వరం గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెల వులు కావడంతో వారి అమ్మ మ్మవారి ఇళ్లు మార్కాపురం పట్టణానికి వచ్చింది. పండుగ సెలవులకు వచ్చిన మనవరాలు ప్రమాదంలో అకాలమరణం చెందడంతో అమ్మమ్మ రామ లక్షమ్మ, బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. మృతురాలు రాధ స్వగ్రామం రాచర్ల మండలంలోని మోడంవారిపల్లి గ్రామం. కాగా తల్లి మృతి చెందడంతో అమ్మ మ్మ రామలక్షమ్మ వద్దే చిన్నప్పటి నుంచి ఉంటోంది.