వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచే వివిధ ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. దీంతో పలు దేవాలయాల్లో తగు ఏర్పాట్లను చేస్తున్నారు. గిద్దలూరు పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో తెల్లవారు జామున 4గంటల నుంచి ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందు కు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన అధ్యక్షులు వాడకట్టు రంగసత్యనారాయణ తెలిపారు. షరాఫ్ బజారుని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో కళాశాల రోడ్డులోని షిర్డిసాయిబాబా మందిరం, వరసిద్ది వినాయకస్వామి దేవాలయం, అభయాంజనేయస్వామి దేవాలయం, రాచర్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, పలు ఆలయాలలో స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.