నిర్మాణరంగంలో అడ్డదారులు తొక్కకూడదని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన నరెడ్కో ప్రాపెర్టీ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా.
బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోంది. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చాం. నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలి. అక్రమ నిర్మాణాలకూ దూరంగా ఉండాలి’’అని పేర్కొన్నారు.