హెచ్‌ఎంపీవీ వ్యాధి గురించి అతిగా భయపడాల్సిన అవసరం లేదని అది కేవలం దగ్గు, జలుబు, శ్వాసకోశాల వరకే పరిమితం అయ్యే వ్యాధి అని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈవ్యాధి నుంచి రక్షింపబడవచ్చని ప్రముఖ వైద్యుడు జి.సమరం అన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో రవి కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ఈవ్యాధిపై మాట్లాడుతూ ఇటీవల చైనాలో ప్రబలిన ఈవైరస్ వ్యాధి గురించి కొందరు భయభ్రాంతులకు గురవుతున్నారని, కరోనాలా ఈ వ్యాధి మల్టీఆర్గాన్స్‌ను ఫెల్యూర్స్ చేయదన్నారు. జలుబు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పితో వారం పది రోజుల్లో తగ్గిపోతుందన్నారు. మాస్క్ ధరించి, చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. వ్యాధి పట్ల అవగాహన ఉంటే చాలన్నారు.