పాడిరైతుల సంక్షేమమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లె జయచం ద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని గోపిదిన్నెలో గోకులం షెడ్డును టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే రైతుల సంక్షేమం కోసం రాయితీ కింద గోకులం షెడ్లను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షు డు రెడ్డప్పరెడ్డి, సిద్దమ్మ, రాజంపేట పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్‌నాయుడు, ఉత్తమ్‌రెడ్డి, చెరువు నీటి సంఘం అధ్యక్షుడుశివకుమార్, ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి, మండల ప్రధాన కార్య దర్శి కృష్ణమూర్తి నాయుడు, వీరాంజినేయులు, సోముశేఖర్, వార్డు సభ్యుడు జగదీష్, భాస్కర్, క్లస్టర్ ఇంచార్జి బేరి శీన, తెలుగు యువత నరసింహులు, మ్యూజికల్ శివ, మణి, మదనమోహనరెడ్డి, కాలానారాయణ, ఆనంద్‌నాయుడు, జయరాంరెడ్డి, శివకు మార్, శ్రీనివాసులు, గంగాధర్, బాలాజీ నాయుడు పాల్గొన్నారు.