హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 సీజన్‌లోని రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. క్వాలిఫయర్ 1తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఐపీఎల్ 2025కి మార్చి 21న తెరలేవనుంది.
ఈ టోర్నీ ఆరంభం మ్యాచ్, మే 25న జరిగే ఫైనల్ మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆ జట్టు హోమ్ గ్రౌండ్ అయిన కోల్‌కతాకు ఫస్ట్, ఫైనల్ మ్యాచ్‌ల ఆతిథ్యం దక్కింది.
ఐపీఎల్ ప్లేయర్స్ బీ అలర్ట్ - ఇకపై ఆ ఐసీసీ రూల్స్ అమలు"ఐపీఎల్ ప్లేయర్స్ బీ అలర్ట్ - ఇకపై ఆ ఐసీసీ రూల్స్ అమలు"
గతేడాది రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌కు రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు కేటాయించారు. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. గత సీజన్ మాదిరే ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ఐసీసీ ప్రవర్తన నియమావళిని అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఒకరు తెలిపాడు. 'ఇక నుంచి ఐపీఎల్‌లో ఐసీసీ ప్రవర్తన నియమావళిని అమలు చేస్తాం. ఇప్పటి వరకు ఐపీఎల్ తన సొంత ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకుంది.'అని మీడియాకు తెలిపాడు.
నాలుగు వేదికల్లో డబ్ల్యూపీఎల్..
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్ కోసం బీసీసీఐ నాలుగు వేదికలు ఖరారు చేసింది. ముంబై, బెంగళూరు, బరోడా, లక్నోలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ఈ టోర్నీ జరగనుంది.