ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా దారుణంగా విఫలమవడంతో హెడ్ కోచ్‌గా గంభీర్ పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతను బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. శ్రీలంక గడ్డపై సుదీర్ఘ కాలం తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై ఓ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఖంగుతిన్నది.
ఈ క్రమంలోనే గంభీర్ పనితీరుపై మాట్లాడిన మాంటీ పనేసర్ అతనిపై వర్క్‌లోడ్ ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా గంభీర్‌కు జట్టు నుంచి సరైన గౌరవం దక్కడం లేదన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై గంభీర్‌కు మెరుగైన రికార్డ్ లేకపోవడంతో ఆటగాళ్ల మర్యాదను కోల్పోతున్నాడని ఈ ఇంగ్లండ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. గంభీర్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే హెడ్ కోచ్‌గా కొనసాగించి టెస్ట్ ఫార్మాట్‌కు లక్ష్మణ్‌ను నియమించాలని మాంటీ పనేసర్ సూచించాడు.
హెడ్ కోచ్ అనే గౌరవం లేదు..
'గంభీర్‌పై వర్క్ లోడ్ ఎక్కువ అవుతోంది. అతను ఇటీవలే కోచ్‌గా మారాడు. దాంతో సీనియర్ ఆటగాళ్ల నుంచి అతనికి సరైన గౌరవం దక్కడం లేదు. కొన్నేళ్ల కిత్రం గంభీర్ తమ సహాచరుడని, అతను ఇప్పుడు ఎలా ఆడాలో మాకు చెబుతున్నాడని సీనియర్ ఆటగాళ్లు భావిస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా బ్యాటర్‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై గంభీర్‌కు మెరుగైన రికార్డ్ లేదు.
రోహిత్ శర్మ యూటర్న్ - గంభీర్ షాక్!"రోహిత్ శర్మ యూటర్న్ - గంభీర్ షాక్!"
ఆస్ట్రేలియా గడ్డపై అతని సగటు 23. ఇంగ్లండ్‌లోనూ గొప్ప యావరేజ్ లేదు. కదిలే బంతిని గంభీర్ ఆడలేడు. కోచ్‌గా గంభీర్ సామర్థ్యాలపై సెలెక్టర్లు పునరాలోచించాలి. లేదా అతన్ని వన్డే, టీ20లకు మాత్రమే పరిమితం చేయాలి.
గంభీర్ మాట వింటున్నారా..?
టెస్ట్ టీమ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వంటి వారిని నియమించాలి. లేకుంటే కనీసం లక్ష్మణ్‌ను బ్యాటింగ్ కోచ్‌గానైనా నియమించి గంభీర్‌కు సాయం చేయమని చెప్పాలి. అతను రాహుల్ ద్రవిడ్‌లానే రాణించగలడు. ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగలడు.
విభిన్న పరిస్థితుల్లో రాణించిన ఆటగాడిని కోచ్‌గా నియమించాలి. ఎందుకంటే అలాంటి ఆటగాడు కోచ్‌గా వస్తేనే ఆటగాళ్లు సహజంగా గౌరవం ఇస్తారు. లక్ష్మణ్ కోచ్‌గా ఉండి.. 'బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఆడవద్దు'అని చెబితే అతని సలహా వింటారు. కానీ గంభీర్ విషయంలో ఇలా జరుగుతుందని మాత్రం నేను కచ్చితంగా చెప్పలేను. అతన్ని వారు సీరియస్‌గా తీసుకుంటారా? అన్నది కూడా సందేహమే. గంభీర్ సూచనలకు సరే అని తలూపి.. వారి సహజ గేమ్ ఆడుతారు.'అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు.