డ్రాగన్‌ఫ్రూట్‌లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండును తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కూడా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కణాలను రక్షిస్తుంది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల్ని, మలబద్ధకం వంటి సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు..డ్రాగన్ ఫ్రూట్‌లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకలు బలంగా మారతాయి.డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ని నాశనం చేసి క్యాన్సర్‌ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ చాలా ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ, కొంతమందికి ఇది సరిపడకపోవచ్చు.