ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలు పెట్టింది తానేనని, రాయలసీమ ప్రాంతం వెనకబడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇచ్చామని.. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ మాకు పూర్తి మద్దతు తెలిపారని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విభజనకు అప్పటి సిఎంగా ఉన్న రోశయ్య మద్దతు తెలపలేదని చెప్పారు. ట్యాంకు బండ్‌పై విగ్రహాలు పగలకొడుతున్నప్పుడు శ్రీ కృష్ణ దేవరాయ విగ్రహం పగలగొట్టే ముందు మాపై దాడి చేయండని కోరానని.. వెంటనే ఆందోళన కారులు మమ్మల్ని గౌరవించి వెనక్కి వెళ్ళారన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేసే దిశగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలని, విభజన హామీల అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని టీజీ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.