ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తెస్తామని, భవిష్యత్‌ను ఊహించి అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేశామని, పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, నీరు, జనాభాను సమతుల్యం చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు. సంపద సృష్టిస్తామని, ప్రజల ఆదాయం పెంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను గోదావరిలో కలిపిందని, ఇస్రో మరో ఘనత సాధించిందని, అంతరిక్షంలో స్పేస్ డాకింగ్ విజయవంతం చేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.