సంక్రాంతి పండుగను తమ సొంతూళ్లలో ఎంతో ఆనందంగా జరుపుకున్న ప్రజలు తిరిగి తమ రొటీన్ లైఫ్‌లోకి అడుగుపెట్టేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. సంక్రాంతి సంద్భంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చేయడంతో ఈనెల 11 నుంచే హైదరాబాదీలు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. నాలుగు రోజుల పాటు సంక్రాంతిని తమ వారి మధ్య ఎంతో ఉత్సహంగా జరుపుకుని సెలవులు అయిపోవడంతో హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీంతో బస్సులు, రైల్వే స్టేషన్‌లు తిరుగు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు ఎక్కడ చూసిన ప్రయాణికులు నిండిపోయారు.ఓవైపు రైళ్లో సీటు దొరక్క, కిందా మీద పడి మరీ ప్రయాణికులు హైదరాబాద్‌కు వస్తుంటే.. ఓ రైలు మాత్రం ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగి వచ్చేసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాము ఇలా సీట్లు దొరక్క అల్లాడిపోతుంటే ఓ రైలు ఖాళీగా రావడం పట్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.