నదుల అనుసంధానంతోనే కరవు రహిత రాష్ట్రం సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అని చెప్పారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని అన్నారు. కడప జిల్లా మైదుకూరులో ఇవాళ(శనివారం) సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘‘స్వేచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తామని అన్నారు. బనకచర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని ఉద్ఘాటించారు. వేంకటేశ్వరస్వామి పాదాల వరకు గోదావరి నీరు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.తాను కూడా రాయలసీమ బిడ్డనే అని గుర్తుచేశారు. నదుల అనుసంధానంతోనే కరవు రహిత రాష్ట్రం సాధ్యమని తెలిపారు.కడప స్టీల్‌ప్లాంట్ కూడా పూర్తి చేస్తామన్నారు. కొప్పర్తి ఇండస్ట్రీయల్ కారిడార్ పూర్తిచేసి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ నెల చివర్లోనే వాట్సాప్ గవరెన్స్ తీసుకొస్తామని అన్నారు. గండికోటను టూరిజం హబ్‌గా చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాలనలో ఏం జరిగిందో అందరూ చూశారని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.