ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‍రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భక్తుల గుడారాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన భక్తులు శిబిరాల నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది.