గుంటూరులో కొకైన్ సరఫరా చేస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు కథనం ప్రకారం.. గుంటూరులోని నల్లచెరువు ప్రాంతానికి చెందిన షేక్ దాదావలి, ఖాసీంపీరా అనే ఇద్దరు సోదరులు, సంపత్‌నగర్ శివారు నంబూరు సుభాని కాలనీకి చెందిన షేక్ సమీర్‌బాజీ కొకైన్ విక్రయిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై రవీందర్‌నగర్ నుంచి శ్యామలానగర్‌కు కొకైన్ తీసుకెళ్తున్న ఈ ముగ్గురు పట్టుబడ్డారు. వీరి వద్ద 7 ప్యాకెట్లలో 8.5 గ్రాముల కొకైన్‌తో పాటు ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.