రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో రీసర్వే పేరుతో ఎనిమిది లక్షల ప్రభుత్వ భూములను వైసీపీ నాయకులు కబ్జా చేసి, తమ పేరున నమో దు చేయించుకు న్నారని ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. ఆదివారం యరగాం గ్రామంలో నిర్వహిం చిన రీసర్వే ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలోని వేంకటేశ్వరస్వామి, నీలకంఠేశ్వ రస్వామి, కోదండరామ ఆలయాలకు చెందిన 11.75 ఎకరాల దేవదాయ భూముల నిర్వహణపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదాయ భూములతో పాటు గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామంలోని రెండు చెరువులను డీపట్టాల ద్వారా కొంతమందికి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే వాటిని సరిచేసి చెరువులను కాపాడాలని అధికారు లు ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో అనేక తప్పులు నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సదస్సుల్లో భూ సమస్యలపై నాలుగు లక్షల ఫిర్యాదు లు అందాయన్నారు. వీటన్నింటినీ సరిచేసి ప్రభుత్వ భూములను కాపాడడానికి ప్రస్తుత ప్రభు త్వం రీసర్వే ప్రారంభించి యరగాం గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్.మధుసూదన్, డీటీ జగదీష్, టీడీపీ నాయకులు శివ్వాల సూర్యనారాయణ, అంబళ్ల రాంబాబు, నూక కోటి, సర్వేయర్ సూర్యనారాయణ, రెవెన్యూ అధికారులు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.