దర్శి మండలంలోని తూర్పువీరాయలపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన ఎం.అనీల్(25), స్నేహితులు ధర్మారావు, చినబాబులు కలిసి కారులో బొట్లపాలెం వెళ్లారు. పనిముగించుకుని గ్రామానికి వస్తున్నారు. ఈక్ర మంలో కారు అతి వేగంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లో బోల్తాపడింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావటంతో దర్శి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అనీల్ మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య నిండుగర్భిణి. అదృష్టవశాత్తు అక్కడ పెనుప్రమాదం తప్పింది. కారు ఢీకొట్టడంలో విద్యుత్ స్తంభం విరిగిపడింది. విద్యుత్తు తీగలు కారుపై పడినట్లయితే ఘోరప్రమాదం జరిగేది. మృతుడు అనీల్ కుటుంబసభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. మిగిలిన ఇద్దరు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.