చినగంజాం గ్రామానికి చెందిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ అబ్దుల్ కలాం అజాద్‌ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదివారం పరామర్శించారు. అజాద్ సతీమణి ఖాజున్నీసా బీబీ శుక్రవారం మృతి చెందడంతో ఎమ్మెల్యే ఏలూరి అజాద్ స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం స్థానిక టీడీపీ కా ర్యాలయంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఏలూరి సమావేశం నిర్వహించి, మాట్లాడారు. పెదగంజాం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం, చినగంజాం, కడవకుదురు, కొత్తపాలెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. పల్లెపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు బాపట్ల ఎఫ్‌డీవో చీరాల ఇన్‌చార్జి ఎఫ్‌డీవోగా ఉన్నారని, ఆయన వలన పలు సమస్యలు త్వరగా పరిష్కారం కావడం లేదని, ఆ స్థానంలో మరో అధికారిని నియమించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఏలూరి సమస్యలను పరిశీలించి ఫోన్‌లో అధికారులతో మాట్లాడారు. కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని భాగ్యనగర్‌కు చెందిన మత్స్యకారుడు కర్రి ధనరాజ్ తనకు బోటు ఇప్పించాలని ఏ లూరిని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు పొద వీరయ్య, ఇంకొల్లు మండల అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, చినగంజాం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు రాయని ఆత్మారావు, చెరుకూరి రాఘవయ్య, నాయకులు టీ.జయరావు, ఆసోది సుబ్బారెడ్డి, కోకి భాస్కరరెడ్డి, నరహరి శ్రీనివాసరావు, పర్వతరెడ్డి పార్థసారిఽథి, షేక్ జిలాని, వాటుపల్లి ఏడుకొండలు, డి.తిరుపతిరావు, జి.నరసింహారావు, పెదగంజాం సర్పంచ్ నక్కల కృష్ణ, పలు గ్రామాలనాయకులు పాల్గొన్నారు.