పంచాయతీల్లో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీ వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు కానుంది.
కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. జిల్లాకు ఒక యూనిట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పంచాయతీల ఆదాయం, జనాభాపై జిల్లా కలెక్టర్ల నివేదికలను ఈ కమిటీ పరిశీలించి ఆపై ప్రభుత్వానికి తగిన సిఫార్సులను నివేదించనుంది.