శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయించింది. అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్ పెంచాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, మెనూలో మార్పులు చేశారు. కొత్తగా మసాలా వడలు వడ్డించాలని నిర్ణయించారు. ట్రయల్ రన్ లో భాగంగా నేడు ఐదు వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఈ మసాలా వడలు తయారు చేశారు. కాగా, కొన్ని రోజుల పాటు పరిశీలించి, లోటుపాట్లను సవరించుకుని పూర్తి స్థాయిలో మెనూకి రూపకల్పన చేయనునున్నారు. ఈ మేరకు టీటీడీ కసరత్తులు చేస్తోంది. త్వరలోనే వడలతో కూడిన కొత్త మెనూను టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.