విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలు చేశాడంటూ ఆరోపణలు ఎదురుకుంటున్న ఆదానీ తో రాష్ట్రానికి సంబందించిన అన్ని డీలింగ్స్ విరమించుకోవాలని వామపక్షాలు అడుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే తాజాగా ఆదానీ తో బీజేపీకి సంబంధం ఏంటి అంటూ మాట్లాడిన పురందేశ్వరికి సిపిఐ నేత రిప్లై ఇచ్చారు. ‘అదానీకి, బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పడం హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే అందరి చెవుల్లో పువ్వులు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలా ఉంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.