డిప్యూటీ సీఎం పదవి ఆరవ వేలు లాంటిది. అడ్డమే తప్ప ఉపయోగం లేదని స్వర్గీయ నీలం సంజీవరెడ్డి అన్నారు’ అని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి తెలిపారు. సోమవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనడగడం హాస్యాస్పదం. ఆ పదవికి ప్రోటోకాల్ ఉండదు. అదనపు అధికారాలు, హక్కులు ఉండవు. లోకేశ్ మీద ప్రేమ ఉంటే, ఆయన సామర్థ్యం మీద నమ్మకం ఉంటే టీడీపీ నాయకులు లోకేశ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని అడగాలి. లేదా లోకేశ్‌కు పోటీదారు అవుతున్నాడు.. పవన్‌ను తగ్గించాలి అనుకుంటే డిప్యూటీ సీఎం పదవి ఊడబీకాలి’ అని తులసిరెడ్డి అన్నారు.