నేటి సమాజంలో అందరూ కులమతాలకు అతీతంగా కలసి జీవించాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన జ్యోతిరావు ఫూలే, బీఆర్ అంబేడ్కర్ ముఖచిత్రంతో ముద్రించిన డైరీని ఆయన ఆవిష్కరించారు. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలనకు కేవీపీఎస్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ భూపతి ఆదినారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అ రుణ్, ఐద్వా జిల్లా కార్యదర్శి తులసి, సీఐటీయూ నాయకు లు జువ్వల రాంబాబు, దయా మణి, జనసేన నాయకులు మద్దిపాటి ఫణీంద్ర, గోపీయాదవ్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిడదవోలు మండలం గోపవ రంలో సర్పంచ్ ఆరేపల్లి భాగ్యలక్ష్మి, టీడీపీ నా యకుడు ఆరేపల్లి చిన నంగాలు ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్ విజేతలకు బహు మతుల ప్రదానోత్సవం నిర్వహించారు. దీనికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందించారు. యువత చదువుతోపాటు క్రీడల్లోను ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరగుపల్లి శేషా రావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగల సూర్యా రావు, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జమిందార్‌ను సత్కరించారు. కార్యక్రమంలో పంచదార దుర్గా ప్రసాద్, జుజ్జవరపు గోపి, ఆరేపల్లి దుర్గాశ్రీను, కోయి రమేష్, పంచదార చినవెంకన్న, అడ్డగర్ల వెంకటకృష్ణ పాల్గొన్నారు.