అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. రాజానగరం మండల పరిషత్ కార్యా లయం సమావేశపు హాలుల్లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు జిల్లా కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. మండలస్థాయి అధికారులు పూర్తిగా గ్రామ సచివాలయ సిబ్బందిపై ఆధారపడి పోయారని ఈ విధానం సరైంది కాదన్నారు. మండలస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సం దర్శనలు చేయడం లేనట్టుగా తమ పరిశీలనలో వెలుగుచూస్తున్నాయన్నారు. ప్రధానంగా కొన్ని గ్రామాల్లో తరచూ ఫిర్యాదులు వస్తున్నాయంటే అక్కడ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని అవగతమవుతుందన్నారు. ప్రజలు అధికారులు పనితీరు గమనిస్తూ ఉంటారన్నా రు.గ్రామీణ ప్రాంతాల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు ఇష్టానుసారం తవ్వితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం మండల వ్యాప్తంగా అర్జీలను కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు స్వీకరించారు. ప్రధానంగా రాజానగరం మండలం నందరాడలోని అడుసుమిల్లి వెంక య్య చెరువు (ఏవీ ట్యాంకు)లో నీరు దిగువ ప్రాంతానికి పోకుండా కొంత మంది స్వార్థపరులు అడ్డుకట్ట వేస్తున్నా రని, దీంతో ఎగువ భాగం నరేం ద్రపు రంలో దాదాపు 130 ఎకరాల్లోని పంట పొలాలు ముంపు నకు గురవు తున్నాయంటూ బాధిత రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతుల భూములకు సంబంధించి వస్తున్న ఎఫ్‌లైన్ ఫిటిషన్లను ఎందుకు పెండింగ్ పెడు తున్నారంటూ మండల సర్వేయర్ అనితను నిలదీశారు. ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలంటూ కొంతమంది బాధితులు విన తిపత్రం అందజేశారు. నందరాడ సొసైటీలో అవకతవకలపై ఫిర్యాదు చేస్తే తనకు తెలియ కుండా విచారణ పూర్తి చేశారని అడబాల గణపతిరావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రైతుల భూ సమస్యలకు సంబంధించి పలువురు కలె క్టర్ దృష్టికి తెచ్చారు. ప్రతి సోమవారం మం డలస్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు ఎన్ని అర్జీలు వస్తు న్నాయంటూ తహసీల్దార్ జీఏ ఎల్‌ఎస్ దేవిని ఆరా తీశారు.కార్యక్రమంలో జేసీ చినరాముడు, డీఎల్‌డీవో వీణాదేవి,తహశీల్దార్ జి.అనంతలక్ష్మి సత్యవతి దేవి, ఎంపీడీవో జేఏ ఝాన్సీ, ఎంపీపీ సీతారత్నం పాల్గొన్నారు.