ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు విశాఖ జిల్లా వాసులు భారీగా తరలివెళుతున్నారు. దీంతో శాశ్వత ప్రాతిపదికన నడుస్తున్న ఎక్స్‌ప్రెస్‌లు, కుంభమేళా కోసం అధికారులు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. ప్రయాగ్‌రాజ్‌కు సమీపంలోని గోరఖ్‌పూర్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్లకు వెళ్లే రైళ్లు రద్దీగా ఉంటున్నాయి.మహా కుంభమేళా నేపథ్యంలో విశాఖ నుంచి బనారస్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ప్రతి ఆది, బుధవారాలు (బైవీక్లీ) అందుబాటులో ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌కు మార్చి 19 వరకూ బెర్తులు రిజర్వు అయిపోయాయి. కొన్ని తేదీల్లో కేవలం నాలుగైదు ఫస్ట్ ఏసీ బెర్తులు అందుబాటులో ఉన్నాయి. వారణాసి సమీపంలోని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌లో ఈ రైలుకు హాల్ట్ ఉండడంతో కుంభమేళా స్నానాలకు వెళ్లే భక్తులు బనారస్ ఎక్స్‌ప్రెస్‌ను ఆశ్రయిస్తున్నారు.