పలమనేరు -గుడియాత్తం రహదారిలో ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. సోమవారం సాయంత్రం వేళ ఒంటరి ఏనుగును గుర్తించిన వాహన చోదకులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.పలమనేరు, గంగవరం మండలాల్లో పొలాల వద్ద కాపురమున్న రైతుల ఇళ్లపై ఈ ఏనుగు దాడులకు తెగబడిన విషయం విదితమే. ఇకనైనా అటవీశాఖ అధికారులు ఈ ఒంటరి ఏనుగును కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.