భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. అయితే ఈ మైదానంలో భారత జట్టుకు టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది. ఈ గ్రౌండ్‌లో ఇప్పటివరకు భారత్ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్కదాంట్లో మాత్రమే ఓడిపోయింది. అది కూడా ఇంగ్లాండ్‌తోనే కావడం గమనార్హం. 2011లో ఈ మ్యాచ్ జరిగింది. 2011 నుంచి ఇప్పటివరకు జరిగిన టీ20ల్లో టీమిండియా విజయం సాధించింది.