నూజివీడు పట్టణంలో గల మటాస్ వైద్య కళాశాల లో విద్యాభ్యాసం చేసే మూడోవ సంవత్సరo బిఎస్సి నర్సింగ్ విద్యార్థులకు గత నెల రోజుల నుండి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంపై శిక్షణ ఇస్తున్నారు. కళాశాల లెక్చరర్ గ్లాడిస్ పర్యవేక్షణలో 33 మంది డిఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు వైద్యం సదుపాయం అందించడంపై శిక్షణను అందిస్తున్నట్లుగా బుధవారం ఆమె తెలిపారు. రోగికి వైద్యం అందించే విధానంపై శిక్షణ ఇస్తున్నట్లుగా వివరించారు.