ఏపీ బీజేపీ అధ్యక్ష రేసుపై అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. 'రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కేంద్ర నాయకత్వం టీంను నియామకం చేసుకుంటారు. రాజకీయ పరమైన కార్యాచరణ సైతం రాజకీయ పార్టీలకు అవసరం. ప్రజాసమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని అమిత్ షా మాతో అన్నారు. అధిష్టానం ఏ పదవిని ఇచ్చినా నేను తీసుకుంటా' అని స్పష్టం చేశారు.ఏపీ బీజేపీ అధ్యక్ష పదివి కోసం ఆశావహులు ఎందరైనా ఉండచ్చు, అందరి ఏకాభిప్రాయంతో, కార్యకర్తల క్రమశిక్షణ కారణంగా కమిటీలు వేసుకున్నాం అని దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో పార్టీలోనూ, అలాగే కూటమిలోనూ చర్చించే చేరికలుంటాయని అన్నారు. ‘రాష్ట్ర అధ్యక్షుల విషయంలో కేంద్ర నాయకత్వం టీంను నియామకం చేసుకుంటారు. రాజకీయ పరమైన కార్యాచరణ సైతం రాజకీయ పార్టీలకు అవసరం. కేంద్ర మా సిద్ధాంతాన్ని అర్ధం చేసుకుని పని చేసే వారిని ఆహ్వానిస్తాం. మూడు పార్టీల మధ్య విబేధాలు రాకుండా అన్ని నిర్ణయాలుంటాయి. పార్టీ పడ్డలకు నామీద నమ్మకం ఉంది.