ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రంజీట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ఈ మ్యాచ్ లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. జమ్ముకశ్మీర్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ప్రారంభం నుంచే తడబడ్డాడు. జమ్ముకశ్మీర్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. 19 బంతులను ఎదుర్కొన్న రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో స్టార్ బ్యాట్స్ మన్ జైశ్వాల్ కూడా కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. రెడ్ బాల్ ఫార్మాట్ లో రోహిత్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో మొత్తం 5 ఇన్నింగ్స్ లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోనూ రోహిత్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ పై విమర్శలు ఎక్కువయ్యాయి