వడ్డెర్ల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తామని వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల మురళి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని వడ్డెర్ల సంఘం కార్యాలయంలో బుధవారం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన దేవళ్ల మురళికి ఉమ్మడి అనంత జిల్లా వడ్డెర్ల సంఘం అధ్యక్షుడు కుంచెపు వెంకటేష్, నాయకులు మంజు నాథ్, దళవాయి కుమార్, గంగరాజు శాలువ కప్పి, పూల మాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవళ్ల మురళి మా ట్లాడుతూ.. వడ్డెర్లకు 50 సంవత్సరాలకే పింఛన సదుపాయం కల్పిం చాలన్నారు. కొండ క్వారీలల్లో 35 శాతం కేటాయించాలన్నారు. ప్ర మాద వశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల న్నారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సంఘం నాయకు లు, వడ్డెర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం నాయకులు స మన్వయంతో ముందుకెళితేనే వడ్డెర్లకు తగిన న్యాయం జరుగు తుందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సురేష్, బాల అంకన్న, రామాంజినేయులు, లక్ష్మి, లక్ష్మన్న పాల్గొన్నారు.