రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం శ్రీకాకుళం పట్టణంలో శ్రీ శివప్రియ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రిమ్స్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ, వీల్ చైర్స్, స్ట్రెచేర్స్ అందజేశారు. అదేవిధంగా రెడ్డి శివన్నారాయణ ఆధ్వర్యంలో పలు సంస్కృతిక కార్యక్రమాలు, ఆలయాలలో పూజలు నిర్వహించి యువ నాయకులు నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.