చిత్తూరు జిల్లా, నగరి మండలంలో మూడేళ్ల చిన్నారిపై మోహన్(26) అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నాలుగురోజుల క్రితం బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక దాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన విషయంపై బాలిక తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో నిందితుడైన మోహన్‌ను(26) అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్వర్ తెలిపారు.అనంతరం బాలికను వైద్యశాలకు పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు.ఈ సమాచారం తెలిసి గురువారం రాత్రి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు.చిన్నారిపై అఘాయిత్యం చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.