ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా కుంభమేళాకు వెళ్లేందుకు డబ్బులు లే దొంగగా మారాడు.. వెళ్లకుండానే పోలీసుల చేతికి చిక్కాడు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 07:58 PM

మహా కుంభమేళాకు వెళ్లేందుకు దొంగతనాలు చేసి.. చివరికి ఓ వ్యక్తి పోలీసుల చేతికి దొరికిపోయాడు. ఏకంగా 3 ఇళ్లల్లోకి చొరబడి చోరీలు చేసి పట్టుబడ్డాడు. ఈ దొంగతనాలు చేయడం వల్ల వచ్చే పాపాలను కడుక్కునేందుకు మహా కుంభమేళాకు వెళ్లి.. పుణ్యస్నానం చేయాలని భావించినా అక్కడికి వెళ్లకుండానే పోలీసుల చేతికి చిక్కాడు. ఇంతకీ ఆ దొంగ ఎవరు. అతడు ఎక్కడ దొంగతనం చేశాడు అనేది ఈ స్టోరీలో చూద్దాం.


ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా జరుగుతోంది. ఈనెల 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా.. వచ్చే నెల 26వ తేదీ వరకు మొత్తం 45 రోజుల పాటు సాగనున్నాయి. ఈ మహా కుంభమేళాకు వచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి సాధువులు, సన్యాసులు, భక్తులు కోట్లాదిగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 15 కోట్ల మంది ఈ మహా కుంభమేళాకు రాగా.. మొత్తంగా 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది వస్తారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మహా కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు, విమానాలు.. అన్నీ ప్రయాగ్‌రాజ్ వైపు ప్రయాణిస్తున్నాయి.


ఈ క్రమంలోనే ఆ మహా కుంభమేళాకు వెళ్లాని భావించిన ఢిల్లీకి చెందిన అరవింద్ అలియాస్ భోలా ఎవరూ చేయని పని చేశాడు. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ నగర్‌కు చేరుకునేందుకు.. తిరిగి వచ్చేందుకు అతడి వద్ద డబ్బులు లేవు. దీంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 17వ తేదీన ఢిల్లీలోని దబ్రీ ప్రాంతంలోని రాజ్‌పురిలో ఏకంగా 3 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఆ 3 ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు.. ఇతర ఖరీదైన వస్తువులను దొంగిలించాడు. ఆ వస్తువులను విక్రయించి.. వచ్చిన డబ్బులతో తనతోపాటు తన ఫ్రెండ్స్‌ను మహా కుంభమేళాకు తీసుకెళ్లాలని అరవింద్ అలియాస్ భోలా భావించాడు.


 అయితే.. తాను ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలుస్తుంది.. అన్నట్లు.. అరవింద్ అనుకున్నవి ఏవీ జరగలేదు. చోరీ చేసిన తర్వాత బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అరవింద్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అసలు దొంగతనం ఎందుకు చేశావని ప్రశ్నించగా.. అసలు విషయం వెల్లడించాడు. ఇక తనకు ఏడుగురు అక్కాచెళ్లెళ్లు ఉన్నారని.. తన తండ్రి రోజు వారీ కూలీ పనిచేస్తున్నాడని.. తల్లి ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తోందని వివరించాడు. తన కుటుంబం పరిస్థితి అలా ఉందని.. అందుకే ఎలాగైనా మహా కుంభమేళాకు వెళ్లాలని.. అందుకు డబ్బులు లేక ఇలా దొంగతనం చేసినట్లు పోలీసులకు చెప్పాడు.


మరోవైపు.. అరవింద్‌పై ఇప్పటికే దొంగతనం, దోపిడీకి సంబంధించి 16 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. 2020లో మొట్ట మొదటిసారిగా అరవింద్ అరెస్ట్ అయ్యాడని పోలీసులు పేర్కొన్నాడు. అరవింద్ డ్రగ్స్ సేవించేందుకు గతంలో దొంగతనాలకు కూడా పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com