కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు సూపర్ న్యూస్ చెప్పింది. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్టార్టప్స్ గురించి ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్‌లు, మైక్రో స్కేల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మరింత వృద్ధిలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వీటికి ఊతం ఇస్తూ ప్రోత్సాహకాలు ప్రకటించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వీటి ద్వారా 36 శాతం ఉత్పాదకత వస్తోందన్నారు. స్టార్టప్‌ల కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించారు నిర్మలమ్మ. అంకుర సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు.స్టార్టప్‌లకు ప్రోత్సాహకంగా రూ.5 లక్షలు లిమిట్ కలిగిన క్రెడిట్ కార్డులు ఇస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. మొదటి ఏడాది 10 లక్షల మందికి ఈ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. స్టార్టప్స్ కోసం ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలపారు నిర్మలా సీతారామన్. కార్మికులు ఎక్కువగా పనిచేసే కంపెనీలకు కూడా చేయూత అందిస్తామన్నారు. తోలు బొమ్మలు, బొమ్మల రంగానికి చేయూతను అందిస్తామని.. వాటికి ప్రోత్సాహకంగా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు రాబోయే 5 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ఇస్తామని వివరించారు.