పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ను రాష్ట్రపతికి అందజేశారు. బడ్జెట్ లోని కీలక వివరాలను వివరించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ఆమె అనుమతి కోరారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తూ రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు స్వీటు తినిపించారు. రాష్ట్రపతితో సమావేశం ముగిసిన అనంతరం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర మంత్రి పార్లమెంట్‌కు చేరుకున్నారు. 2025-26 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి అంటూ గురజాడ అప్పారావు సూక్తిని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు.