ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున నుంచే సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. వారికి ఇచ్చిన ఆదేశాల మేరకు, లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పింఛన్లు పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల సమయానికి, మొత్తం 77.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 49.38 లక్షల మందికి రూ. 2,102 కోట్ల విలువైన పింఛన్లు అందించామని అధికారులు తెలిపారు.