శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రథసప్తమి రాష్ట్ర పండుగ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు నిర్వహించిన సూర్య నమస్కారాలలో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గోండు శంకరరావుతో కలిసి యోగాసనాలు చేపట్టారు. మంత్రి మాట్లాడుతూ సూర్య నమస్కారాల కార్యక్రమానికి మంచి స్పందన లభించడం ఆనందదాయకమన్నారు.